ప్రతి వెయ్యి మంది పిల్లల్లో దాదాపు 10 మంది గుండె సమస్యలతో జన్మిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏటా 20 వేల మంది చిన్నారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7 నుండి 14 వరకు "పుట్టుకతో వచ్చే గుండె లోపాల వారోత్సవం" సందర్భంగా అవగాహన పెంచుకుందాం.
చిన్నారుల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?
పాలు తాగేటప్పుడు త్వరగా అలసిపోవడం.
తరచూ ఆయాసం లేదా న్యుమోనియా రావడం.
పెదాలు, గోర్లు లేదా నాలుక నీలం రంగులోకి మారడం.
ఆడుకోవడానికి ఆసక్తి చూపకపోవడం, నిస్సత్తువగా ఉండటం.
వైజాగ్ కిమ్స్ కడల్స్ Consultant Paediatric Cardiologist, Dr. R. Shanti Priya గారు తెలిపినట్లుగా.. మొదటి ఏడాదిలోనే గుర్తిస్తే 85% పైగా సమస్యలను విజయవంతంగా నయం చేయవచ్చు.



