తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో (Prolonged Leaking PV) అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చిన గర్భిణిని, ఆమె శిశువును కిమ్స్ కడల్స్ గైనకాలజిస్ట్ డాక్టర్ మోహన సాయి రూప మరియు వైద్య బృందం అత్యాధునిక వైద్యంతో కాపాడారు.కేవలం 1.260 కిలోల బరువుతో, ఊపిరితిత్తులు సరిగ్గా అభివృద్ధి చెందని స్థితిలో జన్మించిన మగ శిశువుకు NICUలో సర్ఫ్యాక్టెంట్ థెరపీ మరియు ప్రత్యేక శ్వాస సహాయక వైద్యం అందించి పూర్తి ఆరోగ్యవంతుడిగా మార్చారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. రెండు ప్రాణాలను కాపాడిన డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి, డాక్టర్ నవీన్, డాక్టర్ భార్గవ్, డాక్టర్ మురార్జి, డాక్టర్ రేఖా రెడ్డి మరియు వైద్య బృందానికి అభినందనలు!
#KIMSHospital #MaternityCare #NICUSuccess #HealthcareHeroes #NelloreNews





