అత్యవసర వైద్యంతో బాలుడి ప్రాణాలు కాపాడిన కిమ్స్ కడిల్స్ వైద్య బృందం
దుత్తలూరు గ్రామానికి చెందిన యద్దనపూడి చిన్నగురవయ్య కుమారుడు రిషి (3) ఈ నెల 18న తేలు కుట్టడంతో ప్రాణాపాయ స్థితిలో నెల్లూరు కిమ్స్ కడిల్స్ ఆసుపత్రిలో చేరారు.
ఆసుపత్రిలోని పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ మురార్జీ నాయకత్వంలో పిసియు (PICU) విభాగంలో బాలుడికి నిరంతర పర్యవేక్షణలో అత్యవసర వైద్యం అందించారు. డాక్టర్ల నిరంతర కృషితో చిన్నారి పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు డాక్టర్ మురార్జీ, డాక్టర్ భార్గవ్, డాక్టర్ నవీన్, యూనిట్ సీఓఓ డాక్టర్ రోహిణి ప్రియలక్ష్మి మరియు బాలుడి తల్లిదండ్రులను ఆసుపత్రి యాజమాన్యం అభినందించింది.






