కర్నూలులోని కిమ్స్ క్యూడిల్స్లో నిర్వహించిన వైద్య విజ్ఞాన సదస్సును సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ సుధాకర్ ప్రారంభించారు. చిన్నారుల్లో పెరుగుతున్న అలర్జీలు, ఆస్తమా సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, సరైన వైద్య పరీక్షలతో చికిత్స అందించడం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో బెడ్‌సైడ్ అల్ట్రాసౌండ్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం, చికిత్స నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడుతుందని వివరించారు.










